Home

»

Tv News

Bigg Boss Telugu 10 Day 10 Episode 11: రామ్ ప్రసాద్‌ను ఎత్తిపడేసిన రోహిత్.. టెంపర్ వంశీ ఫైర్!

Sep 17, 2026 10:49AM

బిగ్ బాస్ తెలుగు సీజన్-10 రోజురోజుకూ హీటెక్కుతోంది. డే 10 ఎపిసోడ్ 11 కి సంబంధించి కెప్టెన్సీ టాస్క్ లో హై వోల్టేజ్ డ్రామా నడిచింది. బెలూన్ల టాస్క్ లో రోహిత్, త్రిగుణ్, దేబ్జానీ, రామ్ ప్రసాద్ ఓడిపోవడంతో బిగ్ బాస్ వారికి మరో ఛాన్స్ ఇచ్చాడు. ఈ టాస్క్ లో బస్తాలను దక్కించుకోవడమే లక్ష్యంగా పెట్టారు. చివరికి బస్తా ఎవరి దగ్గర ఉంటే వారే విన్నర్ అని బిగ్ బాస్ చెప్పాడు. ఈ టాస్క్ కి టెంపర్ వంశీ సంఛాలక్ గా వ్యవహరించాడు. బస్తా కోసం కంటెస్టెంట్లు ఒకరిపై ఒకరు పడి కొట్టుకున్నారు.

 

రోహిత్, త్రిగుణ్ మధ్య హోరాహోరీ పోరు నడిచింది. రోహిత్ ఏకంగా రామ్ ప్రసాద్ ని ఎత్తిపడేయడంతో హౌస్ లో వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. గేమ్ ఫిజికల్ గా మారడంతో తోటి కంటెస్టెంట్లు షాక్ అయ్యారు. సంఛాలక్ గా ఉన్న టెంపర్ వంశీకి, రోహిత్ కి మధ్య మాటల యుద్ధం మొదలైంది. వంశీ రూల్స్ చెప్తున్నా రోహిత్ వినడం లేదని, తన పద్ధతిలోనే ఆడుతున్నాడని వంశీ ఫైర్ అయ్యాడు. దీంతో వీరిద్దరి మధ్య గొడవ కొట్టుకునే వరకు వెళ్ళింది.

 

ఆటలో ఎవరు తగ్గడం లేదు. ఉడుంపట్టు పట్టి బస్తాని వదలకుండా పోరాడారు. అయితే చివరి రౌండ్ లో రోహిత్ బాగా అలసిపోవడంతో గేమ్ ను వదిలేయాలని అనుకున్నాడు. అప్పటికే రామ్ ప్రసాద్, త్రిగుణ్ టీమ్ లీడ్ లో ఉండటంతో వారిని ఒక్క బ్యాగ్ వదిలేయమని రోహిత్ అడిగాడు. గతంలో గివప్ ఇచ్చినందుకు నామినేట్ చేసిన రోహిత్ ఇప్పుడు తనే గివప్ అంటూ బ్యాగ్ అడుక్కోవడంతో హౌస్ మేట్స్ ఆశ్చర్యపోయారు. చివరికి రామ్ ప్రసాద్, త్రిగుణ్ కండీషన్ పెట్టి బ్యాగ్ ఇచ్చినా, రోహిత్, దేబ్జానీ జోడీ గెలవలేకపోయింది. దీంతో రామ్ ప్రసాద్, త్రిగుణ్ ఈ టాస్క్ లో విజేతలుగా నిలిచారు. దీంతో కెప్టెన్సీ రేస్ నుంచి రోహిత్, దేబ్జానీలలో ఒకరిని తప్పుకోమని బిగ్ బాస్ చెప్పాడు. రోహిత్ దేబ్జానీని నువ్వు వీక్ అంటూ తప్పుకోమని కోరినా ఆమె ఒప్పుకోలేదు. వాళ్ళు డిసైడ్ అవ్వకపోవడంతో బిగ్ బాస్ రామ్ ప్రసాద్, త్రిగుణ్ లను ఫైనల్ చేయమన్నాడు. వారు రోహిత్ ని తప్పించడంతో దేబ్జానీ, త్రిగుణ్, రామ్ ప్రసాద్ తదుపరి రౌండ్ కి వెళ్లారు. ప్రస్తుతం ముఖేశ్, ఝాన్సీ, షాలినీలు కెప్టెన్సీ రేసులో ఉన్నారు. నేటి(గురువారం) ఎపిసోడ్ లో కెప్టెన్సీ కోసం అసలైన పోరు మొదలవ్వనుంది.

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com